టీడీపీ నాయకుడు రమేశ్‌రెడ్డిపై చర్యలు తీసుకోకుంటే 48 గంటల్లో రాజీనామా: ఎమ్మెల్యే కొలికపూడి
- గిరిజన మహిళతో అలవాల రమేశ్‌రెడ్డి అసభ్యకరంగా ఫోన్ సంభాషణ
- ఆయనపై చర్యలు తీసుకోవాలని కొలికపూడి కార్యాలయం వద్ద గిరిజన మహిళల నిరసన
- రమేశ్‌రెడ్డి తనకు తారసపడితే చెప్పు తెగే వరకు కొడతానని కొలికపూడి హెచ్చరిక
రమేశ్‌రెడ్డిపై ఎంపీ కేశినేని శివనాథ్, పార్టీ రాష్ట్ర, జిల్లా అధ్యక్షులు, తిరువూరు టీడీపీ పరిశీలకుడు సహా అందరికీ ఫిర్యాదు చేసినట్టు కొలికపూడి తెలిపారు. 10 రోజులు దాటుతున్నా ఆయనపై చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. రుణం అడిగినందుకు గిరిజన మహిళతో అసభ్యంగా మాట్లాడిన నాయకుడి విషయంలో పార్టీ అధిష్ఠానం ఇప్పటి వరకు స్పందించకపోవడం ఏమిటని కొలికపూడి నిలదీశారు.