దేనికైనా సిద్ధంగా ఉన్నా: కాకాణి గోవర్ధన్
- కాకాణిపై క్వార్ట్జ్ అక్రమ రవాణా కేసు
- హామీలు అమలు చేయాలని అడిగితే కేసులు పెడుతున్నారన్న కాకాణి
- కేసులకు భయపడే ప్రసక్తే లేదని వ్యాఖ్య
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని అడిగితే కేసులు పెడుతున్నారని కాకాణి మండిపడ్డారు. ఏదో ఒక రకంగా తనపై కేసులు పెడుతున్నారని విమర్శించారు. తాజాగా క్వార్ట్జ్ కి సంబంధించి కేసు పెట్టారని దుయ్యబట్టారు. తాను తప్పు చేయలేదని... దేనికైనా సిద్ధంగానే ఉన్నానని చెప్పారు. కేసులకు భయపడే ప్రసక్తే లేదని అన్నారు.