ప్రభాస్ కు ఫిదా అయిపోయా: మాళవిక మోహనన్
- ప్రభాస్ సరసన 'ది రాజాసాబ్'లో నటిస్తున్న మాళవిక మోహనన్
- ప్రభాస్ తో కలిసి నటించడాన్ని అదృష్టంగా భావిస్తున్నానని వ్యాఖ్య
- ఈ సినిమాను జీవితాంతం గుర్తుంచుకుంటానన్న మాళవిక
తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాళవిక మాట్లాడుతూ ప్రభాస్ పై ప్రశంసల వర్షం కురిపించింది. ప్రభాస్ మంచితనం, సహృదయతకు ఫిదా అయిపోయానని చెప్పింది. ప్రభాస్ వంటి గొప్ప వ్యక్తితో నటించడాన్ని అదృష్టంగా భావిస్తున్నానని తెలిపింది. ఈ సినిమాలో ఛాన్స్ రావడాన్ని లక్కీగా భావిస్తున్నానని... ప్రభాస్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడానికి మించిన ఆనందం ఏముంటుందని సంతోషం వ్యక్తం చేసింది. ఈ సినిమాను జీవితాంతం గుర్తుంచుకుంటానని చెప్పారు. మరోవైపు హారర్ కామెడీ థ్రిల్లర్ గా 'ది రాజా సాబ్' తెరకెక్కుతోంది.