పోసానికి బెయిల్ మంజూరు చేస్తూ.. కోర్టు పెట్టిన కండిషన్స్ ఇవే!
- పవన్, నారా లోకేశ్ లపై అనుచిత వ్యాఖ్యల కేసు
- పోసానికి బెయిల్ మంజూరు చేసిన గుంటూరు కోర్టు
- కేసు గురించి బహిరంగంగా మాట్లాడరాదన్న కోర్టు
పోసానికి కోర్టు విధించిన షరతులు ఇవే:
- రూ. 2 లక్షల విలువతో ఇద్దరు వ్యక్తులు పూచీకత్తు ఇవ్వాలి.
- జైలు నుంచి విడుదలైన తర్వాత దేశం విడిచి వెళ్లరాదు.
- కేసు గురించి ఎక్కడా బహిరంగంగా మాట్లాడకూడదు. మీడియాతో కూడా మాట్లాడకూడదు.
- పత్రికలకు ప్రకటనలు ఇవ్వరాదు.
- నాలుగు వారాల పాటు ప్రతి మంగళ, గురువారాల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల్లోపు మంగళగిరిలోని సీఐడీ కార్యాలయానికి వచ్చి సంతకం చేయాలి.
- కేసు దర్యాప్తుకు పూర్తిగా సహకరించాలి.