ఈ నెల 29 న సూర్యగ్రహణం.. ఏయే దేశాల్లో కనిపిస్తుందంటే..?
- కొత్త ఏడాదిలో తొలి సూర్యగ్రహణం
- పాక్షికంగానే కనిపిస్తుందంటున్న నాసా
- నార్త్ అమెరికా, యూరప్, ఆఫ్రికా, నార్తర్న్ ఆసియా దేశాల వాసులు చూడొచ్చని వెల్లడి
వెస్ట్రన్ యూరప్ లో మధ్యాహ్నం, నార్త్ వెస్ట్రన్ ఆఫ్రికాలో ఉదయం పూట, ఈస్ట్రన్ యూరప్ లో సాయంత్రం వేళ ఈ గ్రహణం కనిపిస్తుందని తెలిపారు. మార్చి 29న భూమి మరియు సూర్యుడికి మధ్య చంద్రుడు ప్రయాణించే క్రమంలో సూర్యగ్రహణం ఏర్పడుతుందని నాసా పేర్కొంది. భూమిపై నుంచి చూస్తే సూర్యుడు పాక్షికంగా అస్పష్టంగా మారుతాడని శాస్త్రవేత్తలు చెప్పారు.