గెలవక ముందు 'జనసేనాని'.. గెలిచాక 'భజన సేనాని': ప్రకాశ్ రాజ్
కాగా, నిన్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై ప్రకాశ్ రాజ్ ఓ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. బహుభాషా విధానంపై ఏపీ డిప్యూటీ సీఎం చేసిన వ్యాఖ్యలకు నటుడు కౌంటర్ ఇచ్చారు. హిందీ భాషను తమపై రుద్దకండి అంటూ చెప్పడం ఇంకో భాషను ద్వేషించడం కాదని ఆయన ట్వీట్ చేశారు. స్వాభిమానంతో తమ మాతృభాషను, తల్లిని కాపాడుకునే ప్రయత్నమనే విషయాన్ని పవన్‌కి దయచేసి ఎవరైనా చెప్పాలని ప్రకాశ్ రాజ్ కోరారు.