యూట్యూబ్ లోని వీడియోలు అన్నీ చూడడానికి ఎంతకాలం పడుతుందో తెలుసా?
- నిమిషానికి 500 గంటల కంటెంట్ అందుబాటులోకి..
- యూట్యూబ్ లో తొలి వీడియో ‘మీ ఎట్ ది జూ’
- 130 దేశాల్లో 80 భాషల్లో యూట్యూబ్ వీడియోలు
ఈ లెక్కన ఓ వీడియో చూసేలోపే మరో నెల రోజులకు సరిపడా వీడియోలు య్యూట్యూబ్ లో చేరుతూ ఉంటాయి. ఇప్పటి వరకు యూట్యూబ్లో ఉన్న ఛానళ్ల సంఖ్య దాదాపు 12 కోట్లు. రోజురోజుకూ కొత్త ఛానళ్లు పుట్టుకొస్తూనే ఉన్నాయి. ఇక, సోషల్ మీడియాలో సంచలనం సృష్టించిన షార్ట్స్ గురించి చెప్పనక్కర్లేదు. 15 సెకన్లు మాత్రమే ఉండే ఈ షార్ట్స్ లను య్యూట్యూబ్ తొలుత భారత్ లో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టింది. సక్సెస్ కావడంతో ఇతర దేశాల్లోనూ అందుబాటులోకి తీసుకొచ్చింది.
అమెరికాలోని కాలిఫోర్నియా కేంద్రంగా పనిచేసే య్యూట్యూబ్ ప్రపంచంలోని 130 దేశాల్లో 80 భాషల్లో విస్తరించింది. ఉత్తర కొరియా, చైనా, తుర్కియే, మొరాకో, సౌత్సుడాన్, ఉజ్బెకిస్థాన్, తజికిస్థాన్ తదితర దేశాల్లో య్యూట్యూబ్ పై నిషేధం అమలవుతోంది. య్యూట్యూబ్ లో మొట్టమొదట అప్ లోడ్ చేసిన వీడియో ‘మీ ఎట్ ది జూ’.. య్యూట్యూబ్ రూపకర్తలలో ఒకరైన జావేద్ కరీమ్ షేర్ చేసిన ఈ వీడియోను ఇప్పటి వరకూ 35 కోట్ల మంది చూశారు. ఇక య్యూట్యూబ్ లో అత్యధికమంది చూసిన వీడియో ‘బేబీ షార్క్ డూడూ... డూడూ’. పిల్లలు పాడుకునే ఓ రైమ్కి సంబంధించిన ఈ వీడియోను అక్షరాలా 1500 కోట్ల మంది చూశారట.