పోసానికి రిమాండ్... హైకోర్టుకు వెళతామన్న పొన్నవోలు
- పోసానికి 14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు
- బీఎన్ఎస్ సెక్షన్ 111ను కోర్టు పరిగణనలోకి తీసుకోలేదన్న పొన్నవోలు
- ఈ విషయంలో తాము సగం సక్సెస్ అయినట్టేనని వ్యాఖ్య
పోసానిపై పెట్టిన బీఎన్ఎస్ సెక్షన్ 111ను మేజిస్ట్రేట్ పరిగణలోకి తీసుకోలేదని చెప్పారు. ఈ విషయంలో తాము సగం సక్సెస్ అయినట్టేనని అన్నారు. పోసాని వ్యాఖ్యలు వర్గాల మధ్య వైషమ్యాలను రెచ్చగొట్టేలా ఉన్నాయంటూ పోలీసులు పెట్టిన రెండు సెక్షన్లపై మేజిస్ట్రేట్ ఏకీభవించారని చెప్పారు. అందుకే రిమాండ్ విధించారని అన్నారు.