అమెరికాలో కోమాలో కూతురు.. వీసా కోసం భారత్ లో తల్లిదండ్రుల విజ్ఞప్తి
- ఈ నెల 14న జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ భారత సంతతి విద్యార్థిని
- రెండు రోజుల తర్వాత తమకు తెలిసిందని చెబుతున్న తల్లిదండ్రులు
- కూతురు దగ్గరికి వెళ్లేందుకు వీసా కోసం ఎంపీ సుప్రియా సూలేను ఆశ్రయించిన పేరెంట్స్
ఈ విషయాన్ని ఎంపీ సుప్రియా సూలే ట్విట్టర్ ద్వారా భారత విదేశాంగ శాఖ దృష్టికి తీసుకువెళ్లారు. కేంద్ర మంత్రి జైశంకర్ స్పందించి నీలం షిండే తల్లిదండ్రులకు వీలైనంత త్వరగా వీసా అందించేందుకు సాయపడాలని కోరారు. నీలం షిండే కుటుంబానికి తాము అండగా ఉంటామని సుప్రియా సూలే చెప్పారు. కాగా, సతారా జిల్లాకు చెందిన నీలం షిండే నాలుగేళ్ల క్రితం ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లింది. ఈ ఏడాదితో చదువు పూర్తవుతుందని, ఇంతలోనే ఇలా జరిగిందని తానాజీ షిండే కన్నీటి పర్యంతమయ్యారు.