మహిళ ప్యాంట్ జేబులో పేలిన సెల్ ఫోన్... వీడియో ఇదిగో!
ఆ మహిళ భర్తతో కలిసి సూపర్ మార్కెట్ లో షాపింగ్ చేస్తోంది. ఆ సమయంలో సెల్ ఫోన్ ను బ్యాక్ పాకెట్ లో పెట్టుకుంది. ఒక్కసారిగా ఫోన్ పేలడంతో మంటలు వచ్చాయి. ఈ ప్రమాదంలో ఆమె నడుము భాగానికి, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. సూపర్ మార్కెట్లోని సీసీటీవీ కెమెరాల్లో ఈ ఘటన రికార్డయింది.