విశ్రాంతి తీసుకోవాలంటూ సాయిపల్లవికి డాక్టర్ల సూచన
- జ్వరం, జలుబుతో బాధ పడుతున్న సాయిపల్లవి
- రెండు రోజులు బెడ్ రెస్ట్ తీసుకోవాలని వైద్యుల సూచన
- అనారోగ్యం కారణంగా 'తండేల్' ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో పాల్గొనలేకపోయిన సాయిపల్లవి
'తండేల్' సినిమా విషయానికి వస్తే... ఈ చిత్రంలో నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటిస్తున్నారు. చందు మొండేటి దర్శకత్వం వహించారు. బన్నీ వాసు నిర్మించిన ఈ సినిమాకు... అల్లు అరవింద్ సమర్పకులుగా వ్యవహరించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చారు. ఫిబ్రవరి 7న ఈ సినిమా విడుదల కానుంది. వాస్తవ ఘటనల ఆధారంగా ఈ సినిమాను నిర్మించారు. 'లవ్ స్టోరీ' తర్వాత నాగచైతన్య, సాయిపల్లవి కలిసి నటిస్తున్న సినిమా కావడంతో... ఈ చిత్రంపై అభిమానుల అంచనాలు భారీగానే ఉన్నాయి.