రంజీ ట్రోఫీ కోసం కోహ్లీ ప్రాక్టీస్.. సైనీ బౌలింగ్‌లో ఇబ్బంది పడిన ఇండియన్ స్టార్
- ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లో ఇబ్బంది పడిన కోహ్లీ
- రంజీల్లో ఢిల్లీకి ప్రాతినిధ్యం వహించనున్న టీమిండియా స్టార్
- నెట్స్‌లో చెమటోడుస్తున్న విరాట్
నెట్స్‌లో ఆత్మవిశ్వాసంతో కనిపించిన విరాట్.. సైనీ, శర్మ బౌలింగ్‌లో తొలుత ఇబ్బంది పడినప్పటికీ ఆ తర్వాత కొన్ని షాట్లు కూడా కొట్టాడు. అంతకుముందు అరగంటపాటు ముగ్గురు స్నిన్నర్లు హర్ష్ త్యాగి (లెఫ్టార్మ్), సుమిత్ మాథుర్ (లెఫ్టార్మ్), శివం (రైటార్మ్)లను కోహ్లీ ఎదుర్కొన్నాడు. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో కోహ్లీ దారుణంగా విఫలమైన సంగతి తెలిసిందే. కాగా, రంజీల్లో కోహ్లీ ఢిల్లీకి ప్రాతినిధ్యం వహించనున్నాడు.