దిల్ రాజు ఇంట్లో కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్న ఐటీ అధికారులు
- నాలుగు రోజులుగా దిల్ రాజు నివాసంలో ఐటీ సోదాలు
- దిల్ రాజు కూతురు నివాసంలో కూడా డాక్యుమెంట్ల పరిశీలన
- లీగల్ ఫార్మాలిటీస్ పూర్తి చేస్తున్న ఐటీ అధికారులు
గేమ్ ఛేంజర్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాల నిర్మాత దిల్ రాజు నివాసం, కార్యాలయంలో వారు సోదాలు జరిపారు. నాలుగు రోజుల ఐటీ సోదాల్లో దిల్ రాజుకు సంబంధించిన పలు కీలక అంశాలను ఐటీ అధికారులు గుర్తించినట్టు సమాచారం. ఆయన ఇంట్లో కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఐటీ టీమ్ ప్రస్తుతం లీగల్ ఫార్మాలిటీస్ పూర్తి చేస్తున్నట్టు సమాచారం. దిల్ రాజు కూతురు హన్సితా రెడ్డి ఇంట్లో కూడా డాక్యుమెంట్లను అధికారులు వెరిఫై చేస్తున్నారు.
అటు, పుష్ప-2 సినిమాకు సంబంధించి రూ. 1,800 కోట్లకు పైగా ఆదాయం వచ్చినట్టు మేకర్స్ ప్రకటించారు. కానీ దానికి తగినట్టుగా పన్నుల చెల్లింపులు జరిగనట్టు ఐటీ అధికారులు గుర్తించారు. నాలుగు రోజులుగా 18 ప్రదేశాల్లో ఐటీ అధికారులు 55 బృందాలుగా ఏర్పడి సోదాలు నిర్వహించారు.