రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ను కలిసిన నటుడు మంచు మనోజ్
- కొన్నిరోజులుగా మోహన్ బాబు కుటుంబంలో వివాదాలు
- మంచు మనోజ్‌కు ఇటీవల నోటీసులు పంపిన కలెక్టర్
- ఈ క్రమంలో వివరణ ఇచ్చేందుకు కలెక్టర్‌ను కలిసిన మనోజ్
తన ఆస్తుల్లో ఉంటున్న వారిని ఖాళీ చేయించాలని కోరుతూ మోహన్ బాబు ఇటీవల మేజిస్ట్రేట్‌ను అశ్రయించారు. జల్‌పల్లిలోని తన నివాసాన్ని కొందరు ఆక్రమించుకున్నారని మోహన్ బాబు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తాను కొంతకాలంగా తిరుపతిలోనే ఉంటున్నానని తెలిపారు. అనంతరం ఆ నివాసంలో ఉంటున్న మనోజ్‌కు కలెక్టర్ నోటీసులు పంపించారు. ఈ క్రమంలో వివరణ ఇచ్చేందుకు మంచు మనోజ్ తాజాగా కలెక్టర్‌ను కలిసినట్లుగా తెలుస్తోంది.