బెంగళూరులో చైనా వైరస్.. ఇద్దరు పసికందులకు హెచ్ఎంపీవీ పాజిటివ్
- చైనాలో వేలాదిగా బయటపడుతున్న వైరస్ కేసులు
- జపాన్ కూ వ్యాపించిన హెచ్ఎంపీవీ.. భారత్ లో రెండు కేసులు నమోదు
- 3 నెలల పాప, 8 నెలల బాబుకు వైరస్ నిర్ధారణ
ఈ వైరస్ సోకిన వారిలో ఫ్లూ తరహాలో దగ్గు, జలుబు, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ప్రధానంగా పదకొండు సంవత్సరాల లోపు వయసున్న చిన్నారులలోనే ఈ వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్నట్లు చైనా వైద్య నిపుణులు చెబుతున్నారు. చైనాలో ఇటీవల ఈ వైరస్ వ్యాప్తి విపరీతంగా పెరుగుతోంది. పలుచోట్ల వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడానికి అక్కడి ప్రభుత్వం ఆంక్షలు కూడా విధించింది. హెచ్ఎంపీవీ వైరస్ జపాన్ కూ వ్యాపించింది.