అల్లు అర్జున్ ను ఫోన్ లో పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
- సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ అరెస్ట్
- మధ్యంతర బెయిల్ ఇచ్చిన తెలంగాణ హైకోర్టు
- ఈ ఉదయం చంచల్ గూడ జైలు నుంచి విడుదలైన బన్నీ
- ధైర్యంగా ఉండాలని సూచించిన చంద్రబాబు
ఇవాళ చంచల్ గూడ జైలు నుంచి విడుదలైన అల్లు అర్జున్ మొదట గీతా ఆర్ట్స్ కార్యాలయానికి వెళ్లారు. అక్కడి నుంచి తన నివాసానికి చేరుకున్నారు. పరామర్శించడానికి వచ్చే సినీ ప్రముఖులతో బన్నీ నివాసం సందడిగా మారింది.