‘పుష్ప2’ సినిమా ఎలా ఉందో చెప్పిన రామ్ గోపాల్ వర్మ
- పుష్ప2 ‘ఆలిండియా ఇండస్ట్రీ హిట్’ అన్న వర్మ
- అల్లు అర్జున్, చిత్ర బృందానికి అభినందనలు తెలిపిన ఆర్జీవీ
- అల్లు అర్జున్ ఈజ్ మెగా మెగా మెగా మెగా మెగా అంటూ వ్యాఖ్య
పుష్ప2 ‘ఆలిండియా ఇండస్ట్రీ హిట్’ సాధించిందని రామ్ గోపాల్ వర్మ వ్యాఖ్యానించారు. హిట్ కొట్టిన హీరో అల్లు అర్జున్‌తో పాటు చిత్ర బృందానికి ఆయన అభినందనలు తెలియజేశారు. ‘‘అల్లు అర్జున్ ఈజ్ మెగా మెగా మెగా మెగా మెగా’’ అంటూ ఆసక్తికర కామెంట్ చేశారు. ఈ మేరకు గురువారం ఉదయం ‘ఎక్స్’ వేదికగా ఆయన స్పందించారు.
అంతకుముందు 'పుష్ప-2' సినిమా విడుదల సందర్భంగా బుధవారం పెట్టిన ఓ పోస్టులోనూ హీరో అల్లు అర్జున్‌పై రామ్ గోపాల్ వర్మ ప్రశంసల జల్లు కురిపించారు. మెగా కంటే అల్లు ఎన్నో రెట్లు మెగా అని, కేవలం గ్లోబల్ స్టార్ మాత్రమే కాదు, ప్లానెట్ స్టార్ అని కితాబునిచ్చాడు.