విచారణ కోసం జగన్ అమెరికాకు వెళ్తే.. జీవితాంతం ఏపీకి తిరిగిరాడు: బుద్దా వెంకన్న
- అధికారమదంతో నాని, వంశీ నోటికొచ్చినట్టు మాట్లాడారన్న వెంకన్న
- చంద్రబాబును విమర్శించే నైతిక అర్హత కూడా వారికి లేదని వ్యాఖ్య
- వీళ్లను చూసి పోసాని కూడా అడ్డగోలుగా వాగాడని విమర్శ
కొడాలి నాని, వల్లభనేని వంశీ, పోసాని, దేవినేని అవినాశ్ వంటి వారు క్షమార్హులు కాదని వెంకన్న అన్నారు. ఇలాంటి వెధవలకు శిక్షలు పడితే ఇతరులకు గుణపాఠం అవుతుందని తెలిపారు. వాళ్ల మాదిరి తాము డబ్బుకు అమ్ముడుపోయే వ్యక్తులం కాదని చెప్పారు. తాము ఏనాడూ భారతీరెడ్డి గురించి తప్పుగా మాట్లాడలేదని అన్నారు. టీడీపీ కార్యకర్తలను ఇప్పుడు టచ్ చేస్తే చేయి తీసేస్తారని హెచ్చరించారు.