అది చెన్నైకే అంకితం: అల్లు అర్జున్
- అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో పుష్ప – 2 ది రూల్
- డిసెంబర్ 5న వరల్డ్ వైడ్ రిలీజ్
- చెన్నైలో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో అల్లు అర్జున్ కీలక వ్యాఖ్యలు
ఈ సందర్భంగా అల్లు అర్జున్ తన కెరీర్‌కు సంబంధించి అనేక కీలక విషయాలను పంచుకున్నారు. చెన్నై వస్తే ఆ అనుభూతే వేరుగా ఉంటుందన్నారు. ఈ నేలతో తనకు అంత అనుబంధం ఉందన్నారు. తన జీవితంలో తొలి 20 సంవత్సరాలు చెన్నైలోనే గడిచాయని చెప్పారు. తాను ఏమి సాధించినా అదంతా చెన్నైకే అంకితమని అల్లు అర్జున్ ప్రకటించారు.