మహిళా సంరక్షణ కార్యదర్శుల జాబ్ చార్ట్ పై అసెంబ్లీలో చర్చ.. హోంమంత్రి జవాబు
- జాబ్ చార్ట్ విషయంలో గందరగోళం నెలకొందన్న సభ్యులు
- దానికి గత ప్రభుత్వ నిర్వాకమేనని బదులిచ్చిన హోంమంత్రి అనిత
- ప్రభుత్వంలో ఉన్న శాఖలు అన్నింటినీ కలిపి జాబ్ చార్ట్ రూపొందించారని విమర్శ
గ్రామస్థాయిలో శాంతిభద్రతల పరిరక్షణ నుంచి అంగన్ వాడీలో పిల్లల సంరక్షణ వరకూ వారికి అన్ని బాధ్యతలను అప్పగించారని విమర్శించారు. ఈమేరకు అసెంబ్లీలో సభ్యులు అడిగిన ప్రశ్నకు జవాబిస్తూ.. గ్రామ సచివాలయంలో మహిళా సంరక్షణ కార్యదర్శుల జాబ్ చార్ట్ విషయంలో నెలకొన్న గందరగోళాన్ని తొలగించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. మహిళా సంరక్షణ కార్యదర్శులను ఎలా వినియోగించుకోవాలనే విషయంపై ప్రభుత్వం చర్చలు జరుపుతోందని, ఆ తర్వాత వారికి తగిన బాధ్యతలు అప్పగిస్తామని హోంమంత్రి అనిత చెప్పారు.