సాయిపల్లవి నా బిడ్డ లాంటిది: అల్లు అరవింద్
- తండేల్ మూవీ ప్రెస్ మీట్‌లో నిర్మాత అల్లు అరవింద్ కీలక వ్యాఖ్యలు
- సాయి పల్లవి నటనకు ప్రశంసలు
- సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన అల్లు అరవింద్ వ్యాఖ్యలు
రీసెంట్‌గా సాయి పల్లవి నటించిన 'అమరన్' మూవీ చూశానని, మూవీ చూసి బయటకు వచ్చే సమయంలో కళ్లల్లో నీళ్లు తిరిగాయని అల్లు అరవింద్ అన్నారు. సినిమా చివరిలో ఉన్న సీన్‌లో సాయి పల్లవి నటన ప్రతి ఒక్కరి హృదయాలను కలచివేసిందన్నారు. తాను సాయి పల్లవిని ఎప్పుడూ సొంత కూతురులా చూస్తానని, తనకు కూతురు ఉంటే ఇలా ఉంటుందేమో అనిపిస్తుందన్నారు. దాంతో తాను మూవీ చూసి బయటకు రాగానే సాయిపల్లవికి కాల్ చేసి ప్రశంసించినట్లు తెలిపారు.