కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ కు సానుభూతి తెలిపిన పవన్ కల్యాణ్
- ఈ తెల్లవారుజామున కన్నుమూసిన సుదీప్ తల్లి సరోజ
- మరణ వార్త తెలిసి చింతించానన్న పవన్ కల్యాణ్
- మాతృ వియోగం నుంచి సుదీప్ త్వరగా కోలుకోవాలన్న డిప్యూటీ సీఎం
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా సుదీప్ కు సానుభూతిని తెలియజేశారు. ఎక్స్ వేదికగా పవన్ స్పందిస్తూ... సుదీప్ గారి మాతృమూర్తి సరోజ గారు కన్నుమూశారని తెలిసి చాలా చింతించానని తెలిపారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని చెప్పారు. తన నట జీవితంలో తల్లి ప్రభావం, ప్రోత్సాహం ఎంతో వున్నాయని తనతో సుదీప్ చెప్పారని గుర్తు చేసుకున్నారు. మాతృ వియోగం నుంచి సుదీప్ త్వరగా కోలుకోవాలని అన్నారు. సుదీప్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని చెప్పారు.