టాలీవుడ్ లో తన అభిమాన హీరో ఎవరో చెప్పిన ప్రకాశ్ రాజ్!
- దేవర చిత్రం సక్సెస్ మీట్లో పాల్గొన్న ప్రకాశ్ రాజ్
- ఆస్కార్ అవార్డు ఫంక్షన్లో దిగ్గజాల ముందు తారక్ మాట్లాడిన తీరు చూసి గర్వపడ్డానని పేర్కొన్న ప్రకాశ్ రాజ్
- దర్శకుడికి అండగా తారక్ నిలబడ్డాడని కితాబు
ఈ విజయోత్సవ వేడుకల్లో ప్రకాశ్ రాజ్ మాట్లాడుతూ.. దేవర ఇంతటి ఘన విజయం సాధించినందుకు ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. తనకు తారక్ అంటే ఎంతో ప్రేమ ఉందని చెప్పారు. ఆస్కార్ ఫంక్షన్లో ఎంతో మంది దిగ్గజాల ముందు తారక్ మాట్లాడుతుంటే తాను ఇంట్లో కూర్చుని టీవీ చూస్తూ ఎంతో గర్వపడ్డానని తెలిపారు. ఈ సినిమా కోసం ఒక దర్శకుడికి తారక్ అండగా నిలబడ్డాడని పేర్కొన్నారు.