ఓటీటీలోకి 'గోట్' మూవీ.. ఎప్పుడు, ఎక్కడ స్ట్రీమింగంటే..!
- ఈ నెల 3 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో 'గోట్' ప్రసారం
- 'ఎక్స్' వేదికగా అధికారికంగా ప్రకటించిన ఓటీటీ ప్లాట్‌ఫామ్
- ఒకేసారి తమిళ, మలయాళ, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో విడుదల
తాజాగా ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయింది. ఈ నెల 3వ తేదీ నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో 'గోట్' ప్రసారం కానుంది. నెట్‌ఫ్లిక్స్ తాజాగా 'ఎక్స్' (ట్విట్టర్) ద్వారా అధికారికంగా ప్రకటించింది. తమిళంతో పాటు మలయాళం, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో ఒకేసారి అందుబాటులో ఉంటుందని తెలిపింది.
ఇక ఈ సినిమాలో విజయ్‌తో పాటు ప్రశాంత్, వైభవ్, ప్రభుదేవా, లైలా, జయరాం, యోగిబాబు, కిచ్చా సుదీప్ ఇతర కీలక పాత్రల్లో కనిపించారు. విజయ్ తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేసిన ఈ మూవీలో ఆయనకు జోడిగా మీనాక్షి చౌదరి, స్నేహ నటించారు. యువన్ శంకర్ రాజా బాణీలు అందించారు.