నాగార్జునసాగర్ కు కొనసాగుతున్న వరద ప్రవాహం... 24 గేట్లు ఎత్తిన అధికారులు
- ఎగువ ప్రాంతాల్లో వర్షాలు
- కృష్ణా నది పోటెత్తుతున్న వైనం
- నాగార్జునసాగర్ వద్ద ఇన్ ఫ్లో 2.63 లక్షల క్యూసెక్కులు
- 2.21 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేసిన అధికారులు
సాగర్ పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా... ప్రస్తుతం ప్రాజెక్టులో 311.4 టీఎంసీల నీరు ఉంది. మహారాష్ట్ర, కర్ణాటకలో ఇప్పటికీ వర్షాలు కురుస్తుండడంతో కృష్ణా నది పోటెత్తుతోంది.