నందమూరి మోక్షజ్ఞకు శుభాకాంక్షలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్
- టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన నందమూరి మోక్షజ్ఞ
- మోక్షజ్ఞ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఫస్ట్ లుక్ విడుదల చేసిన మేకర్స్
- తాత ఆశీస్సులు నీపై కురవాలన్న జూనియర్ ఎన్టీఆర్
'హనుమాన్' సినిమా దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ వెండితెరకు పరిచయం అవుతున్నారు. ఈరోజు మోక్షజ్ఞ పుట్టినరోజును పురస్కరించుకుని ఫస్ట్ లుక్ ను మేకర్స్ విడుదల చేశారు. 'సింబ ఈజ్ కమింగ్' అంటూ ఫస్ట్ లుక్ పై పేర్కొన్నారు. బాలయ్య వారసుడు హీరోగా వస్తుండటంతో నందమూరి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.