టాప్ త్రీ లోని భామల జోరు తగ్గినట్టే!
- భారీ ఫ్లాపులతో వెనుక బడిన పూజ హెగ్డే
- 'పుష్ప 2'తో పుంజుకునే ప్రయత్నాల్లో రష్మిక
- 'దసరా' తరువాత తగ్గిన కీర్తి సురేశ్ దూకుడు
- టాప్ త్రీ రేసులోకి చేరలేకపోతున్న ఇతర హీరోయిన్స్
పూజ హెగ్డే విషయానికే వస్తే, ఆమెకి ఎంతగా వరుస హిట్లు పడుతూ వచ్చాయో, అంతే వేగంగా పరాజయాలు పలకరిస్తూ వచ్చాయి. పైగా ఆ ఫ్లాప్ సినిమాలన్నీ పాన్ ఇండియావి కావడంతో ఎఫెక్ట్ కాస్త ఎక్కువగానే పడింది. 'ఆచార్య' తరువాత హీరోయిన్ గా ఆమె ఇంతవరకూ తెలుగు తెరపై కనిపించలేదు. హిందీ .. తమిళ ప్రాజెక్టులు మాత్రమే ఆమె చేతిలో ఉన్నాయి.
రష్మిక విషయానికి వస్తే .. 'పుష్ప' తరువాత ఆమె చేసిన 'సీతారామం' .. 'వారసుడు' .. 'యానిమల్' సినిమాలు ఆమెకి కలిసొచ్చాయి. 'సీతారామం'లో ఆమె హీరోయిన్ కాదు .. 'వారసుడు'లో ఆమె పాత్రకి అంతగా ప్రాధాన్యత లేదు. అయినా కెరియర్ ఆశాజనకంగానే ఉంది. 'పుష్ప 2' తరువాత పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇక కీర్తి సురేశ్ పరిస్థితి కూడా తెలుగులో అంతంత మాత్రంగానే ఉంది. 'దసరా' తరువాత తమిళంలో చేసిన సినిమాలే ఆమెకి కలిసొచ్చాయి. తెలుగుకి సంబంధించి ఆమె నుంచి ఇప్పట్లో వచ్చే సినిమాలైతే లేవు. తమిళ .. హిందీ సినిమాలు మాత్రం ఉన్నాయి. కొంతకాలంగా ఇక్కడ ఈ ముగ్గురు భామల జోరైతే తగ్గింది. వాళ్ల తరువాత స్థానాల్లో ఎవరున్నారనే ప్రశ్నకు కూడా ప్రస్తుతం సమాధానం దొరకని పరిస్థితే ఉంది.