ఆక్రమణల కూల్చివేత అంశంలో ఎవరిపైనా కక్ష సాధింపు లేదు: పొన్నం ప్రభాకర్
- చెరువుల ఆక్రమణపై ప్రభుత్వం సీరియస్గా ఉందన్న మంత్రి
- ఆక్రమణకు గురైన చెరువుల పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడి
- పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని వ్యాఖ్య
చెరువులకు సంబంధించి ప్రభుత్వ లెక్కలు, రికార్డులు ఉన్నాయని, ఆ మేరకు ప్రభుత్వం కార్యక్రమాలు చేపడుతోందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జలవనరులను రక్షించుకోవాల్సి ఉందన్నారు.
చెరువుల రక్షణపై స్థానికులే ముందుకు రావాలన్నారు. ఆక్రమణలు ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకు రావాలన్నారు. హైడ్రాకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందన్నారు.