కన్నప్ప సినిమాతో తెరపైకి మంచు వారసుడు.. కీలక పాత్రలో అవ్రామ్
- మంచు విష్ణు కథానయకుడిగా కన్నప్ప
- భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న మూవీ
- మనవడి పాత్రను రివీల్ చేస్తూ పోస్టర్ షేర్ చేసిన మోహన్‌బాబు
ఈ మూవీలో మంచు విష్ణు కుమారుడు అవ్రామ్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. నేడు కృష్ణాష్టమని పురస్కరించుకుని అవ్రామ్ లుక్‌ను విడుదల చేశారు. మంచు విష్ణు చిన్నప్పటి పాత్ర అయిన తిన్నడుగా అవ్రామ్ ఇందులో కనిపించనున్నాడు. ఈ పోస్టర్‌ను షేర్ చేసిన మోహన్‌బాబు అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపారు.