విమానం ఎక్కకుండా దేవినేని అవినాశ్ ను అడ్డుకున్న అధికారులు
- దుబాయ్ వెళ్లేందుకు శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చిన అవినాశ్
- లుకౌట్ నోటీసు ఉందని అడ్డగించిన ఎయిర్ పోర్ట్ సిబ్బంది
- చేసేదేంలేక తిరిగి వెళ్లిపోయిన వైసీపీ నేత
దీంతో చేసేదేంలేక విమానాశ్రయం నుంచే అవినాశ్ వెనక్కి వెళ్లిపోయారు. గురువారం రాత్రి శంషాబాద్ విమానాశ్రయంలో చోటుచేసుకుందీ ఘటన. కాగా, టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో దేవినేని అవినాశ్ పై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ దాడికి పాల్పడ్డ వారిలో కొంతమంది దేశం విడిచి పారిపోయే అవకాశం ఉందని పేర్కొంటూ అవినాశ్ సహా పలువురిపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు.