కనీసం జాతీయ గీతం వినే ఓపిక కూడా లేకపోతే ఎలా?: బ్రహ్మానందం
- స్వాతంత్ర్య దినోత్సవం అంటే కేవలం జెండా పట్టుకుని తిరగడం కాదన్న బ్రహ్మానందం
- సినిమా థియేటర్ లలో జాతీయ గీతం వేసినప్పుడు వినే ఓపిక నేటి యువతకు లేకపోవడం బాధాకరమని వ్యాఖ్య
- విద్యార్ధులకు బ్యాగ్ లు, వికలాంగులకు వీల్ చైర్ లు అందజేత
సంక్రాంతి, రంజాన్, క్రిస్మస్ పండుగలు ఎలాగో స్వాతంత్ర్య దినోత్సవం కూడా భారతీయులకు ఒక పండుగ లాంటిదని పేర్కొన్నారు. సినిమా థియేటర్ లలో జాతీయ గీతం వేసినప్పుడు వినే ఓపిక కూడా నేటి యువతకు లేకపోవడం బాధాకరమని బ్రహ్మానందం ఆవేదన వ్యక్తం చేశారు. స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్న మహనీయుల చరిత్రను, త్యాగాలను నేటి యువత తెలుసుకోవాలని ఆయన సూచించారు. అనంతరం విద్యార్దులకు బ్యాగ్ లు, వికలాంగులకు వీల్ చైర్ లను బ్రహ్మానందం చేతుల మీదుగా పంపిణీ చేశారు.