ఇప్పటిదాకా నేను సారీ చెప్పింది ఆమెకు మాత్రమే: సీనియర్ నటుడు నరేశ్
- తప్పు బహిరంగంగా ఒప్పుకుంటానని పేర్కొన్న నటుడు నరేశ్
- జీవితంలో సారీ చెప్పింది తన తల్లికి మాత్రమేనని స్పష్టీకరణ
తన జీవితంలో సారీ అనేది ఎవరికైనా చెప్పి ఉన్నట్లయితే అది తన తల్లికేనని చెప్పారు నరేశ్. తాను మనస్సాక్షిని నమ్ముతానని, నాకు కరెక్ట్ అనిపించిన తర్వాత ఎవరు ఏమి అనుకున్నా తాను తన పని చేసుకుని వెళతానని అన్నారు. మా అమ్మ ఓ సందర్భంలో పిన్ పాయింట్ చేసిందని, అప్పుడు ఆమెపై కోపం వచ్చినా ఆ తర్వాత రియలైజ్ అయి సారీ అని చెప్పడం జరిగిందన్నారు. నాకు తెలిసి అది ఒక్కటేనని అన్నారు. నాది తప్పు ఉంటే బహిరంగంగా ఒప్పుకుంటానని పేర్కొన్నారు. వీరాంజనేయ విహార యాత్ర కామెడీ, భావోద్వేగాల కలయిక అని, ఇది అందరినీ ఆకట్టుకుంటుందని తెలిపారు.