మనవడికి బౌలింగ్ చేసిన అల్లు అరవింద్... వీడియో ఇదిగో!
ఎంతో బిజీగా ఉండే అల్లు అరవింద్... దొరికిన కొద్దిపాటి విరామంలో క్రికెట్ ఆడి సేద దీరారు. మనవడు అల్లు అయాన్ బ్యాటింగ్ చేస్తుండగా, అల్లు అరవింద్ బౌలింగ్ చేశారు. తమ ఇంటి కాంపౌండ్ లో జరిగిన తాతామనవడి క్రికెట్ మ్యాచ్ ను అల్లు అర్జున్ అర్ధాంగి స్నేహారెడ్డి సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఐకాన్ స్టార్ అభిమానులు ఈ వీడియోను విపరీతంగా షేర్ చేస్తున్నారు.