అమరావతిని అనుసంధానిస్తూ రూ.2,047 కోట్లతో రైల్వే ప్రాజెక్టు: కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్
- ఏపీ రాజధాని అమరావతికి బడ్జెట్ లో ప్రత్యేక కేటాయింపులు
- అమరావతి రైల్వే పనులు పురోగతిలో ఉన్నాయన్న రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్
- రైల్వే పనుల డీపీఆర్ కు నీతి ఆయోగ్ ఆమోదం కూడా లభించిందని వెల్లడి
- ఇతర అనుమతుల కోసం సమయం పట్టే అవకాశముందని వివరణ
అమరావతి రైల్వే ప్రాజెక్టు పనులు పురోగతిలో ఉన్నాయని వెల్లడించారు. అమరావతిని అనుసంధానిస్తూ 56 కిలోమీటర్ల మేర రూ.2,047 కోట్లతో ప్రాజెక్టు చేపడుతున్నట్టు వివరించారు. ఈ రైల్వే పనులపై డీపీఆర్ కు నీతి ఆయోగ్ ఆమోదం కూడా లభించిందని అశ్విని వైష్ణవ్ తెలిపారు. మరిన్ని అనుమతుల కోసం కొంత సమయం పట్టే అవకాశం ఉందని చెప్పారు.