యూకే ఎన్నికల్లో రిషి సునాక్ పార్టీకి ఘోర ఓటమి.. లేబర్ పార్టీదే విజయం.. ఎగ్జిట్ పోల్స్ అంచనా
- కన్జర్వేటివ్ పార్టీకి ఓటమి తప్పదన్న ఎగ్జిట్ పోల్స్
- లేబర్ పార్టీకి 410, కన్జర్వేటివ్ పార్టీకి 131 స్థానాలు వస్తాయని విశ్లేషణ
- కీర్ స్టార్మర్ బ్రిటన్ తదుపరి ప్రధాని అవుతారని అంచనా
ఇక ఈ ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీకి 131 స్థానాలు మాత్రమే వస్తాయని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. కాగా గత ఎన్నికల్లో ఆ పార్టీ 346 సీట్లు గెలిచింది. 2016 నుంచి ఇప్పటివరకు కన్జర్వేటివ్ పార్టీలో ఐదుగురు వేర్వేరు ప్రధాన మంత్రులు మారారు. జీవన వ్యయాల పెరుగుదల, కొన్నేళ్లుగా కొనసాగుతున్న అస్థిరత, పార్టీలో అంతర్గత పోరు కన్జర్వేటివ్‌ల ఓటమికి కారణాలు కాబోతున్నాయని ఎగ్జిట్ పోల్స్ విశ్లేషించాయి.
కాగా యూకే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన అధికారిక ఫలితాలు మరికొన్ని గంటల్లో వెలువడనున్నాయి. ఈ మేరకు కౌంటింగ్ ప్రక్రియ మొదలైంది.