'కల్కి' రూ. 1000 కోట్లు కొల్లగొట్టడం ఖాయం: విజయ్ దేవరకొండ
- ప్రభాస్ హీరోగా, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ‘కల్కి 2898 ఏడీ’
- మూవీకి మొదటి ఆట నుంచే సూపర్ హిట్ టాక్
- రెండు రోజుల్లోనే వరల్డ్‌వైడ్‌గా రూ. 298.5 కోట్లు వసూళ్లు
- తాజాగా సినిమా చూసి 'ఎక్స్' వేదికగా స్పందించిన విజయ్ దేవరకొండ
తాజాగా టాలీవుడ్ యువ హీరో విజయ్ దేవరకొండ కూడా సినిమాను చూసి 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా స్పందించాడు. ఈ మూవీతో ఇండియన్ సినిమా న్యూ లెవెల్ అన్‌లాక్ అయిందని విజయ్ అన్నాడు. ఇంతకుముందే సినిమా చూశానని, ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదన్నాడు. ఈ సినిమా రూ. 1000 కోట్లకు పైగా వసూళ్లు కొల్లగొట్టడం ఖాయమని చెప్పుకొచ్చాడు. కాగా, కల్కిలో విజయ్ దేవరకొండ అర్జునుడి పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే.