సంగీత దర్శకుడు కోటి చేతుల మీదుగా 'ప్రణయగోదారి' సాంగ్ రిలీజ్!
- మరో ప్రేమకథగా 'ప్రణయగోదావరి'
- దర్శకుడిగా విఘ్నేశ్ పరిచయం
- పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న సినిమా
- కీలకమైన పాత్రలో సాయికుమార్
పిఎల్‌వి క్రియేషన్స్‌పై ఎంతో ప్రతిష్టాత్మకంగా పారమళ్ళ లింగయ్య ఈ ‘ప్రణయగోదారి’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలతో బిజీగా ఉన్న యూనిట్.. జోరుగా ప్రమోషన్స్ కూడా చేస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా ఈ మూవీలో నుంచి ఫీల్ గుడ్ సాంగ్ లాంచ్ చేశారు. ప్రముఖ సంగీత దర్శకులు కోటి చేతుల మీదుగా ఈ సాంగ్ లాంచ్ చేశారు. 'కలలో కలలో..' అంటూ సాగిపోతున్న ఈ ప్రేమగీతంలో లవ్ బీట్ అదిరిపోయిందని చెప్పుకోవాలి. ఇక గోదావరి అందాలు, నాచురల్ లొకేషన్స్ లో షూట్ చేసిన సీన్స్ ఫ్రెష్ ఫీలింగ్ తెప్పిస్తున్నాయి.
ఈ సాంగ్ లాంచ్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ కోటి మాట్లాడుతూ.. ప్రణయగోదారి నుంచి ఈ సాంగ్ చూస్తుంటే ఫ్రెష్ ఫీలింగ్ కలుగుతోందని, అన్ని వర్గాల ఆడియన్స్ మెచ్చేలా ఈ సాంగ్ షూట్ చేశారని అన్నారు. పాటలోని లిరిక్స్, బీట్, అందుకు తగ్గ సన్నివేశాలు, నటీనటుల వేషధారణ అన్నీ కూడా చాలా బాగా కుదిరాయని అన్నారు. ఈ మేరకు చిత్రయూనిట్ మొత్తానికి ఆల్ ది బెస్ట్ చెప్పారు.