చంద్రబాబు తలుచుకుంటే ఏపీకి స్పెషల్ స్టేటస్: విజయసాయి రెడ్డి
- ఎన్డీఏ కూటమి టీడీపీ మద్దతుపైనే ఆధారపడి ఉందన్న వైసీపీ నేత
- కూటమి సభ్యుడిగా బీజేపీ నేతలను సులభంగా కలవొచ్చని వెల్లడి
- కావాల్సిందల్లా చంద్రబాబకు ఆ సంకల్పం మాత్రమేనని వ్యాఖ్య
ఈమేరకు విజయసాయి రెడ్డి సోమవారం ట్వీట్ చేశారు. నిజంగా చంద్రబాబు సంకల్పిస్తే ఏపీకి ప్రత్యేక హోదా తీసుకురావడం ఇప్పుడున్న పరిస్థితుల్లో కష్టం కాదని అన్నారు. దీనికి కావాల్సిందల్లా నిజమైన సంకల్పం మాత్రమేనని వివరించారు. కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగా అడిగి, రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించాలని సీఎం చంద్రబాబుకు సూచించారు.