'మహారాజ్ఞి'గా కాజోల్ .. గ్లింప్స్ రిలీజ్!
- కాజోల్ ప్రధానమైన పాత్రగా 'మహారాజ్ఞి'
- దర్శకత్వం వహించిన చరణ్ తేజ్
- కీలక పాత్రల్లో ప్రభుదేవా - సంయుక్త మీనన్
- సంగీతాన్ని సమకూర్చిన హర్షవర్ధన్ రామేశ్వర్
యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో ఈ సినిమాను రూపొందించారు. కీలకమైన పాత్రలలో ప్రభుదేవా .. సంయుక్త మీనన్ .. జిషు సేన్ గుప్తా .. నసీరుద్దీన్ షా కనిపించనున్నారు. కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి గ్లింప్స్ రిలీజ్ చేశారు. ప్రధానమైన పాత్రలను కవర్ చేస్తూ చేస్తూ కట్ చేసిన గ్లింప్స్ ఆకట్టుకుంటోంది. 'జవాన్' సినిమాకి సినిమాటోగ్రఫీ చేసిన జీకే విష్ణు ఈ సినిమాకి పనిచేయడం విశేషం.
ప్రధానమైన పాత్రలను ఒక్కొక్కటిగా పరిచయం చేస్తూ వెళ్లారు. అమ్మవారి జాతరలో స్త్రీ శక్తిని గురించి చెబుతూ, కాజోల్ రౌడీలా పనిపట్టడం ఈ గ్లింప్స్ కి హైలైట్. బవేజా స్టూడియోస్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మితమైన సినిమా ఇది. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు.