బాధ్యతాయుతమైన నాయకుడిగా ఫోన్ ట్యాపింగ్‌పై ఎలాంటి ప్రకటన చేయను: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
- ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం దేశభద్రతకు సంబంధించినదన్న ఆర్ఎస్పీ
- ఎవరైనా తమ స్వార్థం కోసం ఫోన్ ట్యాపింగ్ చేస్తే శిక్షపడాలని వ్యాఖ్య
- ఈ వ్యవహారాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవద్దని విజ్ఞప్తి
ఈ సందర్భంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై మీడియా ప్రశ్నించింది. దీనికి స్పందించిన ఆర్ఎస్పీ... ఈ వ్యవహారంపై తాను పబ్లిక్ స్టేట్మెంట్ ఇవ్వలేనన్నారు. ఒకవేళ ఎవరైనా తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఫోన్ ట్యాపింగ్ టెక్నాలజీని ఉపయోగించుకుంటే... అలాంటి వారిని చట్టపరంగా తప్పకుండా శిక్షించాల్సిందే అన్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహరంలో తప్పు చేస్తే శిక్షపడాలన్నారు. అయితే ఈ వ్యవహారాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవద్దని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నానన్నారు.