పిన్నెల్లిపై తీసుకునే చర్యలు ఎలా ఉండాలంటే.. భవిష్యత్తులో ఎవరూ అలాంటి సాహసం చేయకూడదు: ఈసీకి నిమ్మగడ్డ ఫిర్యాదు
- పిన్నెల్లి వ్యవహారంపై ఈసీకి ఫిర్యాదు చేసిన నిమ్మగడ్డ
- ఈవీఎంను పిన్నెల్లి పగలగొడుతున్న వీడియో అందజేత
- కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి
అనుచరులతో కలిసి పోలింగ్ కేంద్రంలోకి దూసుకెళ్లిన పిన్నెల్లి ఈవీఎంను నేలకేసి కొట్టి పగలగొట్టిన వీడియో నిన్న సోషల్ మీడియాకెక్కి వైరల్ అయింది. నేడు మరో వీడియో వెలుగులోకి వచ్చింది. అందులో తనను ప్రశ్నించిన ఓ మహిళను వేలు చూపిస్తూ పిన్నెల్లి బెదిరించడం స్పష్టంగా కనిపిస్తోంది.