'గాడ్ ఫాదర్' డైరెక్టర్ తో మెగాస్టార్!
- 'విశ్వంభర' షూటింగులో బిజీగా చిరంజీవి
- మోహన్ రాజా కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మెగాస్టార్
- గతంలో ఈ కాంబోలో వచ్చిన 'గాడ్ ఫాదర్'
- లైన్ లోనే ఉన్న మారుతి - హరీశ్ శంకర్
ఈ నేపథ్యంలోనే దర్శకుడు మోహన్ రాజాతో సినిమాను చేసే ఆలోచనలో చిరంజీవి ఉన్నారనే ఒక టాక్ వినిపిస్తోంది. ఇంతకుముందు మోహన్ రాజా - చిరంజీవి కాంబినేషన్లో 'గాడ్ ఫాదర్' సినిమా వచ్చింది. 'లూసిఫర్' రీమేక్ గా ఈ సినిమాను రూపొందించారు. 2022లో వచ్చిన ఈ సినిమా, బాక్సాఫీస్ దగ్గర తన ప్రభావాన్ని చూపించలేకపోయింది.
అయితే ఇప్పుడు మోహన్ రాజా వినిపించిన కథ, చిరంజీవికి బాగా నచ్చిందట. అందువలన ఆయన ఈ ప్రాజెక్టును ముందుగా చేయాలనే ఆలోచనలో ఉన్నారని అంటున్నారు. ప్రస్తుతం ఈ స్క్రిప్ట్ పైనే మోహన్ రాజా కసరత్తు చేస్తున్నట్టుగా సమాచారం. ఇక మారుతి .. హరీశ్ శంకర్ దర్శకత్వంలోను చిరంజీవి సినిమాలు చేయనున్నట్టుగా వార్తలు వచ్చాయి. అవి ఎప్పుడు పట్టాలెక్కుతాయనేది చూడాలి.