ఆర్సీబీ ప్లే ఆఫ్స్‌కి చేరడంతో కన్నీళ్లు ఆపుకోలేకపోయిన విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ.. వీడియో ఇదిగో
- చెన్నై విజయం అనంతరం భావోద్వేగానికి గురైన కోహ్లీ దంపతులు
- అనూహ్య రీతిలో పుంజుకొని ప్లే ఆఫ్స్‌కు చేరిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
- సంబరాల్లో మునిగి తేలిన ఆ జట్టు ఆటగాళ్లు, అభిమానులు
కాగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఐపీఎల్ ట్రోఫీని గెలవలేకపోయింది. ఈ సారి ప్లే ఆఫ్స్‌కు చేరడంతో ఆ జట్టు ఫ్యాన్స్ గంపెడాశలు పెట్టుకున్నారు. కాగా కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు ఇప్పటికే ప్లే ఆఫ్‌కు అర్హత సాధించాయి. నేడు (ఆదివారం) జరగనున్న చివరి రెండు మ్యాచ్‌ల ఫలితాల ఆధారంగా ప్లే ఆఫ్స్ మ్యాచ్‌లు ఏయే జట్ల మధ్య జరగనున్నాయనేది ఖరారవుతుంది.