ఆ హక్కు నాకు ఉంది: బుర్ఖా తీసి ఐడీ కార్డ్ చెక్ చేయడంపై బీజేపీ అభ్యర్థి మాధవీలత
- తాను లోక్ సభ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని పేర్కొన్న మాధవీలత
- రిక్వెస్ట్‌గానే తాను ఐడీని చెక్ చేసినట్లు వెల్లడించిన బీజేపీ అభ్యర్థి
- రెండు బూత్‌లలో మోసం జరుగుతోందని గుర్తించానని వ్యాఖ్య
తాను చాలా వినమ్రతగా 'అమ్మా, మీ ఫేస్... ఫొటో ఐడీని చెక్ చేసుకోండి' అని వారిని రిక్వెస్ట్ చేశానని పేర్కొన్నారు. ఆ సమయంలో తాను ఫేస్‌ను, ఫొటో ఐడీని చూశానన్నారు. రెండు బూత్‌లలో ఈవీఎంలను మార్చేశారని ఆరోపించారు. పోటీ చేసే అభ్యర్థిగా ప్రిసైడింగ్ ఆఫీసర్‌ను తీసుకెళ్లి చూపించడానికి తనకు మాత్రమే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే రెండు బూత్‌లలో మోసం చేస్తున్నారని.. దీనిపై ఎవరు మాట్లాడుతారని ఆవేదన వ్యక్తం చేశారు.