సంజుశాంసన్ వివాదాస్పద ఔట్‌పై పెదవి విప్పిన కుమార సంగక్కర
- థర్డ్ అంపైర్ నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిందేనన్న సంగక్కర
- టీవీ అంపైర్ నిర్ణయం రీప్లే యాంగిల్స్‌పై ఆధారపడి ఉంటుందని వ్యాఖ్య
- మ్యాచ్ ఫలితాన్ని మార్చేసిన శాంసన్ ఔట్
మ్యాచ్‌ను విజయం దిశగా నడిపిస్తున్న శాంసన్ వివాదాస్పద ఔట్‌కు వెనుదిరిగాడు. అది మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసింది. 46 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్లతో 186 పరుగులు చేసిన శాంసన్.. ముకేశ్ కుమార్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి లాంగాఫ్‌లో బౌండరీ లైన్ వద్ద షాయ్ హోప్‌కు దొరికిపోయాడు. ఆ సమయంలో షాయ్ బౌండరీ లైన్‌కు తాకినట్టు కనిపించింది. దీంతో నిర్ణయం థర్డ్ అంపైర్ చేతికి మారింది. పలుమార్లు రీప్లేను పరిశీలించిన టీవీ అంపైర్ అవుట్ అని ప్రకటించడం వివాదాస్పదమైంది. ఈ నిర్ణయంపై శాంసన్ ఫీల్డ్ అంపైర్లతో వాదనకు దిగాడు. డగౌట్‌లోని ఆటగాళ్లు కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. తాజాగా, దీనిపై వివరణ ఇచ్చిన సంగక్కర.. అంపైర్ నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిందేనని చెప్పి వివాదానికి ముగింపు పలికాడు.