జగన్ ప్రభుత్వంపై తెలంగాణ కాంగ్రెస్ నాయకురాలు రేణుకా చౌదరి సెటైర్లు
- మూడు రాజధానులపై రేణుకా చౌదరి సెటైర్
- ఏపీకి జగన్ మూడు రాజధానులు ఏర్పాటు చేశారని వ్యాఖ్య
- డ్రగ్స్, మర్డర్స్, నిరుద్యోగమే ఈ రాజధానులని చురక
తెలంగాణ రాజకీయాలపై మాట్లాడిన అనంతరం ఆమె ఏపీలోని వైసీపీ ప్రభుత్వంపై వ్యంగ్యాస్త్రాలు విసిరారు. మూడు రాజధానులపై ఆమె సెటైర్ వేశారు. ఆంధ్రప్రదేశ్‌కు జగన్ మూడు రాజధానులు ఏర్పాటు చేశారని వ్యంగ్యంగా అన్నారు. ఈ మూడు రాజధానుల్లో... ఒకటి డ్రగ్స్, రెండు మర్డర్స్, మూడోది నిరుద్యోగం అని ఎద్దేవా చేశారు. ఏపీలో జగన్ ఏర్పాటు చేసింది ఈ మూడింటినే అన్నారు.