టీడీపీపై విమర్శలు గుప్పించిన కేశినేని నాని, దేవినేని అవినాశ్
- విజయవాడ తూర్పు నియోజకవర్గానికి గద్దె రామ్మోహన్ చేసిందేమీ లేదన్న కేశినేని నాని
- ఎన్నికల తర్వాత టీడీపీ కార్యాలయానికి తాళం వేసుకోవాల్సిందేనని వ్యాఖ్య
- ప్రజల దీవెనలు వైసీపీకి ఉన్నాయన్న దేవినేని అవినాశ్
టీడీపీ కంచుకోట విజయవాడ తూర్పు నియోజకవర్గంలో కూడా వైసీపీకే ప్రజల మద్దతు లభిస్తోందని దేవినేని అవినాశ్ అన్నారు. నియోజకవర్గంలోని కాలనీ ప్రాంతంలో కూడా వసతులు కల్పించడంలో వైసీపీ ప్రభుత్వం సఫలమయిందని చెప్పారు. ప్రజల దీవెనలు వైసీపీకి ఉన్నాయని... సీఎం జగన్ చేసిన అభివృద్ధి, సంక్షేమం తమను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. జనసైనికులను చంద్రబాబు, పవన్ కల్యాణ్ మోసం చేశారని... అందుకే వైసీపీ పట్ల జనసైనికులు ఆకర్షితులవుతున్నారని చెప్పారు.