కూటమి అభ్యర్థికి మద్దతుగా.. చీరాలలో హీరో నిఖిల్ ప్రచారం
- చీరాల నియోజకవర్గ ఎన్‌డీఏ కూటమి అభ్యర్థి ఎం కొండయ్య ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న నిఖిల్
- ఈ ర్యాలీలో భాగంగా గడియార స్తంభం కూడలిలో ప్రసంగించిన టాలీవుడ్ యంగ్ హీరో
- చిరు నవ్వుల చీరాల కావాలంటే కూటమి అభ్యర్థికి ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించిన వైనం
- రాష్ట్ర అభివృద్ధి చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమన్న నటుడు
ఈ ర్యాలీలో నటుడు నిఖిల్‌తో పాటు టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు, నేతలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిఖిల్‌తో ఫొటోలు దిగేందుకు జనాలు ఎగబడ్డారు. ఆయన కూడా వారితో చేతులు కలిపి, సెల్ఫీలు దిగారు. ఈ ర్యాలీలో భాగంగా గడియార స్తంభం కూడలిలో నిఖిల్ ప్రసంగించారు. చిరు నవ్వుల చీరాల కావాలంటే కూటమి అభ్యర్థి కొండయ్యకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. అలాగే రాష్ట్ర అభివృద్ధి చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమని నిఖిల్ అన్నారు.