సెంచరీతో చెలరేగిన జైస్వాల్.. ముంబైపై రాజస్థాన్ గ్రాండ్ విక్టరీ
- 9 వికెట్ల తేడాతో విజయం సాధించిన రాజస్థాన్
- 180 పరుగుల లక్ష్యం సునాయాసంగా ఛేదన
- 59 బంతుల్లోనే శతకాన్ని పూర్తి చేసుకున్న యశస్వి జైస్వాల్
ఇక టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. తిలక్ వర్మ(64), నెహల్ వధేర (49) రాణించారు. ముంబైకి ఆరంభంలో ఎదురుదెబ్బలు తగిలాయి. మొదటి ఎనిమిది ఓవర్లలోనే ఆ జట్టు నాలుగు వికెట్లు కోల్పోయింది. ట్రెంట్ బౌల్ట్ ధాటికి రోహిత్ శర్మ రూపంలో తొలి ఓవర్లోనే వికెట్ పడింది. ఈ మ్యాచ్‌లో సందీప్ శర్మ 5 వికెట్లతో చెలరేగాడు. బౌల్ట్‌కి 2, అవేశ్ ఖాన్, చాహల్‌కు చెరో వికెట్ పడింది. ఈ మ్యాచ్‌లో ఐపీఎల్‌లో 200వ వికెట్ మైలురాయిని అందుకున్నాడు.
ఈ మ్యాచ్‌లో సెంచరీ ద్వారా ఐపీఎల్‌లో అతిపిన్న వయసులోనే 2 సెంచరీలు బాదిన ఆటగాడిగా యశస్వి జైస్వాల్ నిలిచాడు. 23 ఏళ్లు నిండకముందే ఈ ఫీట్‌ని సాధించాడు. కాగా ముంబైపై మ్యాచ్‌లో 59 బంతుల్లోనే జైస్వాల్ సెంచరీ పూర్తి చేశాడు. మొత్తం 60 బంతులు ఎదుర్కొని 104 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్‌లో 7 సిక్సర్లు, 9 ఫోర్లు ఉన్నాయి.