దర్శకుడు శంకర్ కుమార్తె పెళ్లి రిసెప్షన్ కు కుటుంబ సమేతంగా హాజరైన చిరంజీవి, రామ్ చరణ్
- అసిస్టెంట్ డైరెక్టర్ తో శంకర్ కుమార్తె వివాహం
- ఘనంగా పెళ్లి రిసెప్షన్
- సందడి చేసిన మెగా ఫ్యామిలీ
- నూతన వధూవరులకు శుభాకాంక్షలు
చిరంజీవి, కొణిదెల సురేఖ, రామ్ చరణ్, ఉపాసన ఈ వేడుకలో సందడి చేశారు. నూతన వధూవరులు ఐశ్వర్య-తరుణ్ కార్తీక్ లకు శుభాకాంక్షలు తెలియజేశారు. శంకర్ దంపతులతో ముచ్చటించారు.
ప్రస్తుతం రామ్ చరణ్... శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం దసరాకు ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.
